నటి అర్చన: నిజాయతీ గలవాడు.. మహిళలను గౌరవించేవాడు అయి ఉండాలి: నటి అర్చన
- తనకు కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాల గురించి అర్చన
- సినిమాల్లో నాకు వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకున్నా
- బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత మళ్లీ నటించాలని అనిపిస్తోంది
ఒక నటిగా మంచి సినిమాల్లో నటించాలని ఉందని సినీనటి అర్చన చెప్పింది. దీపావళి సందర్భంగా ఈ రోజు ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.... ఇంతకు ముందు తాను ఓ సారి ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటించానని తెలిపింది. బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత మళ్లీ నటించాలని, ఎదగాలని కోరిక కలిగిందని చెప్పింది. తాను ముంబయికి వెళ్లాలనుకుంటున్నానని తెలిపింది. తనకు ప్రేక్షకుల నుంచి మంచి సపోర్ట్ ఉందని వ్యాఖ్యానించింది.
ఇక తనకు కాబోయే భర్తలో ఎలాంటి లక్షణాలు ఉండాలన్న అంశం గురించి మాట్లాడుతూ నిజాయతీ గలవాడు.. మహిళలను గౌరవించేవాడు అయి ఉండాలని తెలిపింది. అంతేగాక, మంచి మనసు ఉండాలని, తోటి వారిని గౌరవించేవాడై ఉండాలని చెప్పింది. తనకు సినిమాల్లో వచ్చిన అవకాశాలన్నీ వినియోగించుకున్నానని తెలిపింది. చాలా టీవీ షోల్లోనూ పాల్గొన్నానని చెప్పింది.