వర్ష సూచన: బంగాళాఖాతంలో వాయుగుండం.. ఉత్తర కోస్తాంధ్రకి భారీ వర్ష సూచన!
- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం
- మరికొన్ని గంటల్లో తీరం దాటే అవకాశం
- మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరిక
ఉత్తర కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే, ప్రస్తుతం బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని, పూరీకి దక్షిణ ఆగ్నేయంగా 440 కిలోమీటర్ల దూరంలో, చాంద్ బలీకి దక్షిణ దిశగా 340 కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమై ఉందని చెప్పారు. పూరీ, చాంద్ బలీ మధ్య మరికొన్ని గంటల్లో వాయుగుండం తీరం దాటుతుందని ఈ ప్రభావంతోనే కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడతాయని పేర్కొన్నారు.