న్యూజిలాండ్: భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ
- సన్నాహక మ్యాచ్‌లో కివీస్ స్పిన్నర్ టాడ్ ఆస్టల్ కి గాయం.. సిరీస్ కు దూరం
- ఆస్టల్ స్థానంలో జట్టులోకి ఇష్ సోధీ
- వచ్చే ఆదివారం ముంబయిలోని వాంఖడె స్టేడియంలో మొదటి వన్డే
- ఈ నెల 25న రెండో వన్డే, 29న మూడో వన్డే
ఈ నెల 22 నుంచి భారత్, న్యూజిలాండ్ క్రికెట్ టీమ్‌ల మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వచ్చే ఆదివారం మొదటి వన్డే ముంబయిలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. అయితే, భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు ఎదురుదెబ్బ తగిలింది.
బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లో కివీస్ స్పిన్నర్ టాడ్ ఆస్టల్ గాయపడ్డాడు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని చెప్పారు. దీంతో ఆయన వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో, ఆస్టల్ స్థానంలో జట్టులోకి ఇష్ సోధీని తీసుకుంటున్నట్లు న్యూజిలాండ్ జట్టు ప్రకటించింది. ఈ నెల 25న రెండో వన్డే, 29న మూడో వన్డే జరగనుంది.