: తిరుమలలో పోలీసుల తనిఖీలు లోపాలమయం: హెచ్చార్సీ
తిరుమలలో పోలీసుల తనిఖీల తీరుపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం కార్యదర్శి సుబ్రహ్మణ్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. లక్షలాది మంది భక్తులు సందర్శించే ప్రాంతంలో తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్న తీరును ఆయన తప్పుబట్టారు. తిరుమలలోని పోలీస్ స్టేషన్లో పాలనను ఆయన ఈ రోజు పరిశీలించారు.