చిరంజీవి: అందుకే, చిరంజీవి అంటే నాకు ఇష్టం : పరుచూరి గోపాలకృష్ణ

  • చిరంజీవి ఓ వ్యవస్థ
  • అన్నదానం, రక్తదానం వంటివి చేస్తున్న మహానుభావుడు  
  • చిరంజీవి వాళ్ల నాన్నగారు నన్ను ‘కామ్రేడ్’ అని పిలిచేవారు
  • నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న గోపాలకృష్ణ

చిరంజీవిని  ఓ మనిషిగా, వ్యక్తిగా, వ్యవస్థగా అభిమానిస్తానని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’ వీడియోలో ఆయన మాట్లాడుతూ, ‘చిరంజీవి వ్యవస్థ ఏంటీ? అనే అనుమానం రావచ్చు! అన్నదానం, విద్యాదానం, రక్తదానం వంటివి చేస్తున్న మహానుభావుడు ఆయన. చిరంజీవి గారు రక్తదానం చేయడమే కాకుండా, తన అభిమానులందరినీ కూడా పాలుపంచుకునేలా చేశారు. అందుకుని, ఆయనంటే నాకు చాలా ఇష్టం. చిరంజీవి వాళ్ల నాన్నగారు నన్ను ఎప్పుడూ ‘కామ్రేడ్’ అని పిలిచేవాళ్లు. చిరంజీవి గారు ఓసారి రష్యా పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ కొన్న లెనిన్ బొమ్మను నాకు కానుకగా ఇచ్చారు. బహుశ, వాళ్ల నాన్నగారు నన్ను ‘కామ్రేడ్’ అని పిలవడం వినే ఈ బొమ్మను చిరంజీవిగారు కానుకగా ఇచ్చారు కావచ్చు!’ అని నాటి జ్ఞాపకాలను గోపాలకృష్ణ గుర్తుచేసుకున్నారు. 

  • Loading...

More Telugu News