మోదీ: తాజ్‌ మహల్‌పై వివాదం రాజుకుంటోన్న నేపథ్యంలో స్పందించిన మోదీ!

  • ఢిల్లీ స‌రితా విహార్‌లో మోదీ ప్రసంగం
  • ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌ను జాతికి అంకితం చేసిన మోదీ
  • చారిత్రక వారసత్వ గౌరవాలను విస్మరించి దేశాలు అభివృద్ధి చెందలేవు
  • ఏదో ఒక కచ్చితమైన సమయంలో గుర్తింపును కోల్పోతాము

ఉత్త‌రప్ర‌దేశ్ సర్కారు త‌మ రాష్ట్ర‌ పర్యాటక గైడులో నుంచి తాజ్‌మహల్‌ను తొలగించిన విష‌యంపై వివాదం రాజుకుంటోన్న విషయం తెలిసిందే. ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల నుంచి విమ‌ర్శ‌ల దాడి అధిక‌మైంది. ఈ నేప‌థ్యంలో ఈ విష‌యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు.

ఢిల్లీ స‌రితా విహార్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆయుర్వేద ఇన్‌స్టిట్యూట్‌ను జాతికి అంకితం చేసిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ... చారిత్రక వారసత్వ గౌరవాలను విస్మరించి దేశాలు అభివృద్ధి చెందలేవని వ్యాఖ్యానించారు. ఒకవేళ వాటిని విస్మరిస్తే క‌చ్చితంగా ఏదో ఒక కచ్చితమైన సమయంలో గుర్తింపును కోల్పోతామని అన్నారు.

తాజ్ మ‌హ‌ల్ అంశంపై బీజేపీ యూపీ ఎమ్మెల్యే సంగీత్‌ సోమ్‌, యూపీ సీఎం ఆదిత్యనాథ్ ప‌లు వ్యాఖ్య‌లు చేశారు. దీనిపై హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ, సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత అజాంఖాన్‌తో పాటు ప‌లువురు విమ‌ర్శ‌లు చేశారు. 

  • Loading...

More Telugu News