‘ఇంటింటీకి తెలుగుదేశం’: ఇటువంటి కార్యక్రమం చరిత్రలో ఎన్నడూ జరగలేదు: సీఎం చంద్రబాబు

  • ‘ఇంటింటికి తెలుగుదేశం’ పాటల సీడీ ఆవిష్కరణ 
  • ఇదో నూతన అధ్యాయం
  • ప్రజల్లో ఉత్సాహం ..మా నాయకుల్లో అమితమైన ఉత్సాహం 
  • మొన్న జరిగిన ఎన్నికలతో టీడీపీ బలమేంటో అందరికీ తెలిసిందన్న చంద్రబాబు

‘ఇంటింటికి తెలుగుదేశం’ వంటి కార్యక్రమం చరిత్రలో ఎన్నడూ జరగలేదని, ఇదొక నూతన అధ్యాయమని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ పాటల సీడీ ఈరోజు విడుదలైంది. 8 పాటలతో రూపొందించిన ఈ సీడీని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ప్రజల్లో ఉంటుందని, అందుకే, ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం చేపట్టామని అన్నారు.

ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ, ‘ఇంటింటికి తెలుగుదేశం’ ద్వారా ప్రజలకు మరింత దగ్గరగా వెళుతున్నామని అన్నారు. ఇటువంటి కార్యక్రమం చరిత్రలో ఎన్నడూ జరగలేదని, ఇదో నూతన అధ్యాయమని, ప్రజల్లో ఉత్సాహం ఉంది కాబట్టే తమ నాయకులు అమితమైన ఉత్సాహంతో పని చేస్తున్నారని ప్రశంసించారు.

ప్రజలు సహకరిస్తే వారి సమస్యలు తెలుసుకుని మెరుగైన సేవలు అందించేందుకు ఆస్కారం ఉంటుందని, కాకినాడ, నంద్యాలలో జరిగిన ఎన్నికల ద్వారా తెలుగుదేశం పార్టీ బలమేంటో రాష్ట్రంలోనే కాకుండా, అందరికీ తెలిసిందని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎన్నో కార్యక్రమాలు చేసే వాళ్లం గానీ, ‘ఇంటింటికి తెలుగుదేశం’ అనేది ఒక లక్ష్యంతో చేస్తున్న కార్యక్రమం అని అన్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో 80 శాతం సంతృప్తి, తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉండాలని అన్నారు.  

  • Loading...

More Telugu News