కాపు రిజర్వేషన్: కాపు రిజర్వేషన్ల అమలుకు డిసెంబర్ 6 డెడ్ లైన్: ముద్రగడ

  • మీడియాతో మాట్లాడిన ముద్రగడ
  • ఇతర కులాలు అనుభవిస్తున్న 49 శాతంలో మాకు వాటా వద్దు
  • 51 శాతంలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నాం
  • రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గం

కాపు రిజర్వేషన్ల అమలుకు డిసెంబర్ 6 డెడ్ లైన్ గా విధిస్తున్నట్టు ప్రభుత్వాన్ని ముద్రగడ పద్మనాభం మరోమారు హెచ్చరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇతర కులాలు అనుభవిస్తున్న 49 శాతంలో తమకు వాటా వద్దని, 51 శాతంలో మాత్రమే రిజర్వేషన్లు కోరుతున్నామని చెప్పారు. కాపు జాతి రోడ్డెక్కే పరిస్థితి తెచ్చింది చంద్రబాబేనని, రిజర్వేషన్ల డిమాండ్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు.

కాపు ఉద్యమానికి మద్దతు తెలిపే అన్ని కులాలను కలుపుకునిపోతామని, అందులో భాగంగానే సామాజిక పరివర్తన సమావేశాలను నిర్వహించనున్నట్టు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పల్స్ సర్వే ఒక్క రోజులోనే నిర్వహించారని, ఆ రిపోర్టును సీఎం కేసీఆర్ పరిశీలించి 9వ షెడ్యూల్ లో చేర్చారని, మరి, ఏపీలో సీఎం చంద్రబాబు ఏ నివేదికను తెప్పించుకోలేదని ఎద్దేవా చేశారు.

  • Loading...

More Telugu News