రామజోగయ్య శాస్త్రి: రవితేజ సహృదయానికి నా జోహార్లు: రామజోగయ్య శాస్త్రి
- దుబాయ్ శీను చిత్రంలోని ఆరు పాటలకి ఐదు పాటలు రాశా
- రవితేజ లాంటి పెద్ద హీరోకి ఆ రోజు పాటలు రాశా
- ఆ సమయంలో రవితేజ నన్ను తన వద్ద కూర్చోబెట్టుకున్నారు
సినీ రచయితగా తన కెరీర్ మొదట్లో రవితేజ నటించిన దుబాయ్ శీను చిత్రంలోని ఆరు పాటలకి ఐదు పాటలు తాను రాశానని సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి జ్ఞాపకం చేసుకున్నారు. రవితేజ నటించిన రాజాది గ్రేట్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా రామ జోగయ్య శాస్త్రి మాట్లాడుతూ... రవితేజ లాంటి పెద్ద హీరోకి పాట రాశానని ఆ రోజు గర్వపడ్డానని అన్నారు. ఆ రోజు రవితేజ తనను దగ్గర కూర్చోబెట్టుకుని మాట్లాడాడని అన్నారు. ‘రవితేజ సహృదయానికి నా జోహార్లు’ అని వ్యాఖ్యానించారు.
ఆ తరువాత రవితేజ నటించిన పలు సినిమాలకు కూడా రాశానని, చాలా గ్యాప్ తరువాత రాజా ది గ్రేట్ సినిమాకి రాశానని అన్నారు. సాయికార్తీక్ ఎంతో అద్భుతమైన సంగీతం అందించాడని అన్నారు.