యాంకర్ అనసూయ: ఎరుపు రంగు చీరలో 'హాట్' యాంకర్ అనసూయ ఫొటోలు!
- వెండితెరపై కూడా కనిపిస్తూ మంచి పేరు తెచ్చుకున్న అనసూయ
- చీరకట్టుతో హొయలొలికిస్తూ పోజులిచ్చిన ముద్దుగుమ్మ
బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా కనిపిస్తూ మంచి పేరు సంపాదించుకున్న అనసూయ సోషల్ మీడియాను బాగానే ఉపయోగిస్తుంటుంది. తన ఇంట్లో జరిగిన విశేషాలు, షూటింగ్‌ల వివరాలు, తాను చేస్తోన్న బుల్లితెర ప్రోగ్రాంల వివరాలు అందులో పోస్ట్ చేస్తుంటుంది.
అప్పుడప్పుడు క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది.వాటికి అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎరుపురంగు చీరను కట్టుకుని హొయలొలుకుతూ పోజులిచ్చింది. ఆమె ఫొటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి.