జగన్ లేఖ: ఏపీ సీఎం చంద్రబాబుకి బహిరంగ లేఖ రాసిన జగన్
- భారీ వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది
- లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి
- ప్రజల ఆక్రందనను పట్టించుకునే తీరిక లేదా?
- రైతుల కష్టం మీకు కనిపించటం లేదా?
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని వివరిస్తూ, రైతుల కష్టాలను తెలియజెప్పుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. రైతుల కష్టం మీకు కనిపించటం లేదా? అంటూ ఆయన ప్రశ్నించారు. లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, ఇటువంటి ఇబ్బందికర సమయంలో రైతుల ఆవేదన, ప్రజల ఆక్రందనను పట్టించుకునే తీరిక ప్రభుత్వానికి లేదా? అని జగన్ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.