క్రికెట్: భారత్, ఆసీస్ టీ20 రద్దు.. అభిమానుల్లో తీవ్ర నిరాశ
- ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా చివరి టీ 20
- వర్షార్పణం అయిన మ్యాచ్
- చిత్తడిగా మైదానం
- 1-1తో సిరీస్ సమం
హైదరాబాద్ శివారులోని ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా చివరి టీ 20 మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. వాన కారణంగా లేటుగా ప్రారంభించాలనుకున్న నిర్వాహకులు మరోసారి పిచ్‌ను పరిశీలించారు. అయితే, వాన తగ్గకపోవడం, మ్యాచ్ ఆడడానికి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మైదానం చిత్తడిగా ఉందని చెప్పారు. దీంతో అభిమానులు స్టేడియం నుంచి నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఆస్ట్రేలియా, భారత్ మొదటి రెండు మ్యాచుల్లో చెరొకటి చొప్పున గెలిచిన విషయం తెలిసిందే. దీంతో సిరీస్ సమం అయింది.