క్రికెట్: ఫలితాన్ని తేల్చే మ్యాచ్... ఓవర్ల కుదింపుతో 8 గంటల తరువాత ప్రారంభమయ్యే ఛాన్స్!

  • అంద‌రూ ఊహించిన‌ట్లే జోరు వాన
  • మ్యాచ్ ఆలస్యం
  • మ్యాచ్ పై అభిమానుల్లో అమితాసక్తి
  • పిచ్ మరోసారి పరిశీలన

అంద‌రూ ఊహించిన‌ట్లే జ‌రుగుతోంది. భారీ వ‌ర్షం కార‌ణంగా హైదరాబాద్ శివారులోని ఉప్పల్ స్టేడియంలో జ‌ర‌గ‌నున్న భార‌త్‌, ఆస్ట్రేలియా చివ‌రి టీ 20 మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభం కానుంది. ఈ రోజు 7 గంట‌ల‌కే ప్రారంభం కావాల్సిన ఈ మ్యాచ్.. వాన కార‌ణంగా లేటుగా ప్రారంభం కానున్న‌ట్లు, 7.45కి మ‌రోసారి పిచ్‌ను ప‌రిశీలించ‌నున్న‌ట్లు తెలిసింది. రాత్రి 8 గంటల తరువాత ఓవ‌ర్లు కుదించి, మ్యాచ్‌ను ప్రారంభించే అవకాశం ఉందని విశ్లేష‌కులు చెప్పారు. ఆస్ట్రేలియా, భార‌త్ మ‌ధ్య జ‌రిగిన రెండు టీ20 మ్యాచుల్లో ఇరు జ‌ట్లు ఒక్కో మ్యాచ్ చొప్పున గెలిచిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్ పై అభిమానుల్లో అమితాసక్తి నెల‌కొంది. జోరువాన మాత్రం తగ్గడం లేదు.

  • Loading...

More Telugu News