వాణీ విశ్వనాథ్: వాణీ విశ్వనాథ్ కు దర్శకుడు వర్మ కౌంటర్!
- వాణీ గారూ, నాకు అసలు ఇల్లే లేదు..ధర్నా ఎలా చేస్తారు!
- రోడ్లపై తిరుగుతూ ఉంటా
- నన్ను వెతుక్కుంటూ మీరూ రోడ్లపై తిరిగితే మీ పాదాలు కమిలిపోతాయి
- ‘ఫేస్ బుక్’ ఖాతాలో వర్మ చమత్కారం
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించనున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు టీడీపీ నేతలు ఇప్పటికే పలు హెచ్చరికలు చేయడం విదితమే. తాజాగా, సినీనటి వాణీవిశ్వనాథ్ చేసిన వ్యాఖ్యలపై వర్మ ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఎన్టీఆర్ గౌరవానికి భంగం కలిగేలా సినిమా తీస్తే చూస్తూ ఊరుకోబోమని, వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తామంటూ వాణీ విశ్వనాథ్ చేసిన హెచ్చరికకు వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఘాటుగా సమాధానమిచ్చారు. ఆ పోస్ట్ లో ఏమన్నారంటే..
‘లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వాణి విశ్వనాథ్
ఎన్టీఆర్ వీరాభిమానిగా, ఆయన సినిమా ఆఖరి హీరోయిన్ గా చెబుతున్నా ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించే ప్రయత్నం రాంగోపాల్ వర్మ వెంటనే మానుకోవాలి. ఎన్టీఆర్ పేరుకు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఎన్టీఆర్ అభిమానులతో కలిసి రాంగోపాల్ వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతా.
నా Reply :
వాణి గారు, నా ఇంటి ముందు ధర్నా చేయడానికి నాకసలు ఇల్లే లేదు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటా....అప్పుడు, మీరు కూడా నన్ను వెతుక్కుంటూ రోడ్ల మీద తిరిగితే సున్నితమైన మీ పాద పద్మములు కమిలిపోవూ?’ అని వర్మ చమత్కరించారు.