సమంత: నేను సమంతకి పెద్ద ఫ్యాన్ ని!: అక్కినేని నాగార్జున
- 'ఏ మాయ చేశావే' సినిమాలో సమంత నటనను చూసి ఆమె ఫ్యాన్ అయిపోయా
- ‘చాలా బాగా చేశావు సమంత’ అని అప్పుడు ఆమెకి ఫోన్ చేసి చెప్పా
- చైతూ, సమంత రిసెప్షన్ ఎప్పుడు జరపాలనే విషయంపై ఆలోచిస్తున్నాం
అక్కినేని నాగ చైతన్య, సమంత రిసెప్షన్ ఎప్పుడు జరపాలనే విషయంపై ఆలోచిస్తున్నామని అక్కినేని నాగార్జున అన్నారు. ఈ తేదీ ఎప్పుడని సమంత, నాగార్జున కూడా తనను అడుగుతున్నారని చెప్పారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన నాగార్జున... సమంత చాలా తెలివిగలదని, రాజుగారి గది-2 సినిమాలో తాను చేసేది చిన్న పాత్ర అయినా ఆ పాత్రకి ప్రాధాన్యత ఉంటుందనే ఉద్దేశంతోనే ఒప్పుకుందని చెప్పారు.
తాను నేను సమంతకి పెద్ద ఫ్యాన్ అని నాగార్జున అన్నారు. ఏమాయ చేశావే సినిమాలో సమంత నటనను చూసిన తరువాత తాను సమంతకి ఫ్యాన్ అయిపోయానని తెలిపారు. ‘చాలా బాగా చేశావు సమంత’ అని అప్పుడు ఆమెకి ఫోన్ చేసి చెప్పానని తెలిపారు. 'ఈ విషయం గుర్తుందా?' అని తన పక్కన కూర్చున్న సమంతని అడిగారు. గుర్తుందని సమంత తల ఊపింది.