అర్జున్ రెడ్డి: ఇది ఆమెకు ఇష్టమైన పాట : విజయ్ దేవరకొండ
- చిన్నారి నోట ‘అర్జున్ రెడ్డి’ సినిమా పాట
- వీడియోను పోస్ట్ చేసిన విజయ్ దేవరకొండ
- ఇది నాకు జీవిత సాఫల్యపురస్కారం అంటూ సంతోషపడ్డ నటుడు
‘అర్జున్ రెడ్డి’ సినిమా రిలీజ్ కు ముందూ, ఆ తర్వాత కూడా హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హీరో విజయ్ దేవరకొండ నటన బాగుందంటూ అభిమానులే కాకుండా విమర్శకులు సైతం ప్రశంసించడం విదితమే. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని ‘ఏమిటేమిటేమిటో ఏమవుతున్నాదో ఏటవాలు దారిలో..’ అనే పాట గురించి విజయ్ దేవరకొండ ప్రస్తావించాడు. ఈ పాటను ఓ చిన్నారి కారులో కూర్చుని పాడుతున్న వీడియోను విజయ్ దేవరకొండ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.
‘ఇది ఆమెకు ఇష్టమైన పాట. నేను ఆమెకు అభిమాన నటుడిని. ఇది నాకు జీవిత సాఫల్య పురస్కారం...’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు. కాగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఓ చిత్రంలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. ‘మహానటి’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రలో అతను నటిస్తున్నాడు.