దొంగలు: రైల్లో హైదరాబాద్ మహిళ నుంచి రూ.కోటి విలువైన బంగారు నగల అపహరణ
- గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో ఘటన
- సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు మియాపూర్ మహిళ ఫిర్యాదు
- రూ.5 లక్షలు కూడా మాయం
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైల్లో హైదరాబాద్ మహిళ నుంచి దుండగులు రూ.కోటి విలువైన బంగారు నగలను అపహరించారు. కొద్దిసేపటి క్రితం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగిన మహిళ తన సంచి చూసుకోగా అందులో తాను దాచిన నగలు కనిపించడం లేదని గుర్తించింది. చోరీ ఘటనపై సికింద్రాబాదు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన పేరు రాణి అని తాను హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉంటానని తెలిపింది. తాను రాజమహేంద్రవరం నుంచి సికింద్రాబాద్‌కు వచ్చిన రైల్లో ప్రయాణం చేశానని తెలిపింది. నగలతో పాటు రూ.5 లక్షలు కూడా మాయమయ్యాయని పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.