బాలుడు: నోటి నుంచి రక్తం, చేతికి, తలకి కట్లు.. ఈ చిన్నారి ఫొటో చూసి నవ్వు ఆపుకోలేకపోతోన్న నెటిజన్లు!
- ‘భార్యతో గొడవ పడ్డా.. అందుకే ఈ పరిస్థితి వచ్చింది’ అని తన టీ షర్ట్ పై పేర్కొన్న బాలుడు
- పోటీల్లో భాగంగా వేషం వేసిన చిన్నారి
- మొదటి బహుమతి కొట్టేసిన ఫొటో వైరల్
ఈ బాలుడి ఫొటోను చూడండి.. ‘నోటి నుంచి రక్తం కారుతోంది, తలకి, చేతికి తీవ్రంగా దెబ్బలు తగలడంతో వైద్యుడితో కట్లు కట్టించుకున్నాడు’ అని అనుకుంటున్నారా? అయితే, మీరు పప్పులో కాలేసినట్లే. సోషల్ మీడియాను అధికంగా చూసేవారు ఇప్పటికే ఈ బాలుడి ఫొటోను చూసే ఉంటారు. ఆ బాలుడికి నిజంగా దెబ్బలు తగల్లేదు. చిన్న గాయం కూడా కాలేదు. ఇటీవల నిర్వహించిన ఫన్నీ పోటీల్లో పాల్గొనేందుకు ఈ చిన్నారి ఇలా వేషం వేశాడు. ఫన్నీ డ్రెస్ పోటీలు అంటూ ఇటువంటి వేషం వేయడం ఎందుకని అనుకుంటున్నారా? అందులో కామెడీని చూపించాడు ఈ చిన్నోడు.
తన భార్యతో గొడవ పడ్డానని అందుకే ఈ పరిస్థితి వచ్చిందని తన టీ షర్ట్ పై పేర్కొన్నాడు. ఇటీవలే జరిగిన ఈ పోటీలు ఎక్కడ జరిగాయన్న విషయంపై స్పష్టత లేదు కానీ, ఈ బాలుడికే ఆ పోటీల్లో మొదటి బహుమతి వచ్చిందట. ఆ బాలుడి ఫొటోపై నెటిజన్లు ఎన్నో సెటైర్లు వేస్తున్నారు. ‘స్త్రీవాదులు నీపై మండిపడతారురోయ్’ అని జోకులు వేస్తున్నారు.