హార్డిక్ పాండ్యా: 'నువ్వంటే నాకు పిచ్చి...' అంటూ హార్దిక్ పాండ్యాకు విషెస్ చెప్పిన అన్నయ్య!
- తమ్ముడికి ట్వీట్ చేసిన కృనాల్
- హార్దిక్.. నువ్వంటే నాకు చెప్పలేనంత ప్రేమ
- ‘నాకు తెలుసు అన్నయ్య’ అంటూ రిప్లై ఇచ్చిన హార్దిక్
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈరోజు తన 24వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా పాండ్యాకు కొలీగ్స్, అభిమానుల నుంచి శుభాకాంక్షలు అందాయి. ముఖ్యంగా, హార్దిక్ సోదరుడు కృనాల్ ఈ సందర్భంగా వరుస ట్వీట్లు చేసి శుభాకాంక్షలు తెలిపాడు.
‘తమ్ముడూ, నీకో విషయం తెలుసా! నువ్వంటే నాకు పిచ్చి. కొన్నిసార్లు కోపంతో నిన్ను అరిచాను. కానీ, నిజం చెప్పాలంటే, నువ్వు లేకుండా నేను ఉండలేను! నువ్వే నాకు స్ఫూర్తి, శక్తి. నువ్వు సాధిస్తున్న విజయాలకు నేను సంతోషిస్తున్నా. ఇది, మనకు ప్రారంభం మాత్రమే అనే విషయం నీకు తెలుసు! ఈ సందర్భంగా నీకో విషయం చెప్పదలచుకున్నాను.. నేను నీ కోసం ఎల్లప్పుడూ ఉంటాను. నువ్వు అంటే నాకు చెప్పలేనంత ప్రేమ. మై బ్రో హ్యాపీ బర్త్ డే.. గాడ్ బ్లెస్ యూ..సంతోషంగా ఉండాలి’ అని కృనాల్ ఆకాంక్షించాడు.
ఇందుకు ప్రతిస్పందించిన హార్దిక్, ‘నాకు తెలుసు అన్నయ్య, నాలో కూడా అదే భావన’ అని అన్నాడు. కాగా, ఐసీసీ, బీసీసీఐ, టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, ముంబై ఇండియన్స్ టీమ్ తదితరులు హార్దిక్ పాండ్యాకు శుభాకాంక్షలు తెలిపారు.