: సింగరాయకొండ మృతుల కుటుంబాలకు లక్ష సాయం
నిన్న అర్థ రాత్రి ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమెంట్ లారీ బోల్తాపడడంతో 10 మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులకు ఒంగోలు రిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. కాగా, మరణించిన వారి కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ప్రకటించారు. క్షతగాత్రులకు వైద్య సహాయం అందిస్తామని చెప్పారు.