పెట్రోల్: వాహనదారులకు ఊరట... పెట్రోల్ బంకు డీలర్ల సమ్మె ఉండదు!
- ఈ నెల 13న సమ్మెను నిర్వహించనున్నట్లు ముందుగా పెట్రోల్ బంకుల డీలర్ల ప్రకటన
- ఈ రోజు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న డీలర్లు
- ఊపిరి పీల్చుకుంటోన్న వాహనదారులు
తమ సమస్యల పరిష్కారం కోరుతూ పెట్రోల్ బంకుల డీలర్లు ఈ నెల 13న (ఎల్లుండి) సమ్మెను నిర్వహించనున్నామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు మరోసారి సమావేశమైన పెట్రోల్ బంక్ డీలర్ల అసోసియేషన్ తమ సమ్మెను విరమించుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. పెట్రోల్ బంకు డీలర్లు సమ్మెకు దిగితే దేశ వ్యాప్తంగా మొత్తం 54,000 పెట్రోల్ బంక్స్ రేపు అర్ధరాత్రి నుంచి 24 గంటల పాటు మూతపడేవి.
పెట్రోల్ బంకు ఒక్కరోజు మూత పడుతుందన్న ఆందోళనలో వాహనదారులు ఈ రోజు పెట్రోలు బంకుల వద్ద బారులు తీరి కనిపించిన విషయం తెలిసిందే. పెట్రోల్ బంకుల డీలర్ల అసోసియేషన్ తమ నిర్ణయంపై వెనక్కి తగ్గకపోతే రేపు అర్ధరాత్రి వరకు కూడా ఇదే సీను రిపీట్ అయ్యేది.