‘లక్ష్మి`స్ ఎన్టీఆర్’ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తే తీయనివ్వండి: నారా లోకేశ్
- అది సినిమా మాత్రమే
- సినిమా గురించి మాట్లాడేదేముంటుంది
- ప్రజాసమస్యలపై మాత్రమే నేను స్పందిస్తానన్న లోకేశ్
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకు ఎక్కించనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ కామెంట్ చేశారు. ‘‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని వర్మ తీస్తే తీయనివ్వండి. అది సినిమా మాత్రమే .. సినిమా గురించి మాట్లాడేదేముంటుంది. ప్రజాసమస్యలపై మాత్రమే నేను స్పందిస్తా’ అని లోకేశ్ అన్నారు. కాగా, వర్మ తెరకెక్కించనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కొంచెం సేపటి క్రితమే వర్మపై మంత్రి సోమిరెడ్డి విమర్శలు గుప్పించడం .. అందుకు, వర్మ ఘాటుగా ప్రతిస్పందించడం తెలిసిందే.