యశ్వంత్ సిన్హా: మళ్లీ విమర్శలు గుప్పించిన యశ్వంత్ సిన్హా

  • ఈసారి జై షాపై విమర్శలు 
  • ఈ వ్యవహారంలో ఏదో తప్పు జరిగినట్టు కనిపిస్తోంది
  • ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలి 

పెద్దనోట్ల రద్దు నిర్ణయం, జీఎస్టీ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోమారు విమర్శలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు జై షాపై అవినీతి ఆరోపణలు రావడంపై యశ్వంత్ సిన్హా విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలతో బీజేపీకి ఉన్న నైతిక స్థాయిని కోల్పోయినట్టయిందన్నారు.

జై షా కేసును వాదించేందుకు ప్రభుత్వ ఉన్నత న్యాయవాది తుషార్ మెహతాను రంగంలోకి దింపడాన్ని ఆయన తప్పుబట్టారు. జైషాకు విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ రుణం మంజూరు చేసిన విధానం, జైషాను వెనకేసుకొస్తున్న తీరు చూస్తుంటే ఏదో తప్పు జరిగినట్టు కనిపిస్తోందని, ఈ విషయమై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించాలని యశ్వంత్ సిన్హా కోరారు.

కాగా, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైషా ఆస్తులు 16 వేల రెట్లు పెరిగాయని ఆరోపిస్తూ ‘ది వైర్’ అనే వెబ్ సైట్ లో ఓ కథనం వచ్చింది. దీనిని సవాల్ చేసిన జై షా రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ కేసును వాదించడానికి న్యాయశాఖ అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రంగంలోకి దిగారు.

  • Loading...

More Telugu News