‘లక్ష్మి`స్ ఎన్టీఆర్’ : ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు, వైఎస్సార్సీపీకి సంబంధముందా? అని అడిగే వారు ఈ ఇంటర్వ్యూ చదవండి!: దర్శకుడు వర్మ
- ఈ విషయాన్ని చాలా మంది అడుగుతున్నారు
- నిర్మాత రాకేశ్ రెడ్డి ఇంటర్వ్యూనే అందుకు సమాధానం
- ఆ ఇంటర్వ్యూను పోస్ట్ చేసిన వర్మ
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లక్ష్మి`స్ ఎన్టీఆర్’ చిత్రంపై ఇప్పటికే అభిమానుల అంచనాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి వైఎస్సార్సీపీ నేత రాకేశ్ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ‘నన్ను చాలా మంది వైఎస్సార్సీపీకి, లక్ష్మి`s ఎన్టీఆర్’కి ఏ విధమైన సంబంధం ఉందా? అని అడుగుతున్నారు. దానికి నా సమాధానంగా నిర్మాత రాకేశ్ రెడ్డి ఓ పేపర్ కిచ్చిన ఇంటర్వ్యూ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను’ అని పేర్కొన్నారు.