ట్రంప్: రక్షణ శాఖ అధికారులతో ట్రంప్ కీలక భేటీ... మరోవైపు ఉ.కొరియాపై చక్కర్లు కొడుతోన్న యుద్ధవిమానాలు

  • యుద్ధ భ‌యాన్ని రేకెత్తిస్తోన్న ఉత్త‌ర కొరియా
  • చెక్ పెట్టేందుకు ట్రంప్ ప్రయత్నం
  • చర్చలతో ఫలితం లేదని ఇప్పటికే స్పష్టం చేసిన ట్రంప్

దుందుడుకు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ యుద్ధ భ‌యాన్ని రేకెత్తిస్తోన్న ఉత్త‌ర కొరియాకు చెక్ పెట్టే అంశంపైన, ఒకవేళ ఆ దేశం నుంచి వచ్చే ముప్పుపట్ల ఎలా స్పందించాలనే అంశంపై రక్షణ శాఖ అధికారులతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భేటీ అయ్యారు. మ‌రోవైపు కొరియన్ ద్వీపకల్పంపై అమెరికా, ద‌క్షిణ కొరియా, జ‌పాన్‌ యుద్ధవిమానాలు తిగిగాయి. ద‌క్షిణకొరియా మిలటరీకి చెందిన రెండు ఫైటర్‌ జెట్‌లు, జపాన్‌కు చెందిన యుద్ధవిమానాలతో క‌లిసి తాము తొలిసారి డ్రిల్‌లో పాల్గొన్నట్లు అమెరికా ప్ర‌క‌ట‌న చేసింది.

అమెరికా అధీనంలో ఉన్న గువామ్‌ ద్వీపంపై భీక‌ర దాడి చేస్తామని ఉత్త‌ర కొరియా కొన్ని రోజుల క్రితం హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. తాజాగా గువామ్‌ బేస్‌ నుంచే ఈ యుద్ధవిమానాలు డ్రిల్‌ చేపట్టడం గ‌మ‌నార్హం. ఉత్త‌ర‌కొరియా ద్వీపకల్పంపై అమెరికా యుద్ధ విమానాలు చ‌క్క‌ర్లు కొట్ట‌డం మంచిది కాద‌ని, దౌత్య మార్గంలో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల‌ని ర‌ష్యా ఇటీవ‌ల సూచించిన విష‌యం తెలిసిందే. చ‌ర్చ‌ల‌తో ఇక లాభం లేద‌ని స్ప‌ష్టం చేసిన ట్రంప్‌.. ఉత్త‌ర‌కొరియా అంశంపై కీల‌క భేటీ నిర్వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.  

  • Loading...

More Telugu News