రేషన్ దుకాణం తలుపులు పగుల గొట్టించిన ఏపీ మంత్రి ప్రత్తిపాటి
- ఉదయం 11 గంటలైనా తెరవని రేషన్ షాపు
- ఆగ్రహంతో తలుపులు పగులగొట్టాలన్న ప్రత్తిపాటి
- విశాఖ పట్నం ఆశీలుమెట్టలో ఘటన
శ్రీనగర్, ఆశీలుమెట్ట తదితర ప్రాంతాల్లో రేషన్ దుకాణాలను ప్రత్తిపాటి తనిఖీ చేశారు. ఆశీలుమెట్ట సర్కిల్-2లోని 173వ దుకాణం తీయకపోవడంతో ఆగ్రహించి, దాన్ని తెరిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ దుకాణాలు తెరవకపోవడాన్ని, సరుకుల పంపిణీలో అవకతవకలను సహించేది లేదని అన్నారు.