క్రికెట్: 70 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా
- ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లకి 77
- క్రీజులో హార్దిక్ పాండ్యా (9) , కుల్దీప్ యాదవ్ (5)
- ఆసీస్ బౌలర్ బెహెండ్రోఫ్ కి నాలుగు వికెట్లు
గువహటి వేదికగా టీమిండియా, ఆసీస్ మధ్య జరుగుతోన్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఇండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాట్స్‌మెన్‌ల వికెట్లు టపాటపా రాలిపోతున్నాయి.
ఈ క్రమంలో 70 పరుగుల వద్ద టీమిండియా ఏడో వికెట్ కోల్పోయింది. బెహెండ్రోఫ్ బౌలింగ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ (8), కెప్టెన్ కోహ్లీ (డకౌట్) వికెట్లు కోల్పోయిన అనంతరం 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శిఖర్ ధావన్ బెహెండ్రోఫ్ బౌలింగ్ లోనే అవుటయ్యాడు. ఆ కొద్దిసేపటికే బెహెండ్రోఫ్.. మనీశ్ పాండే (6) వికెట్‌ను కూడా పడగొట్టాడు.
కొద్ది సేపటికి జంపా బౌలింగ్‌లో కేదార్ జాదవ్ (27), ధోనీ (13) అవుటయ్యారు. క్రీజులోకి వచ్చిన వెంటనే భువనేశ్వర్ కుమార్ (1) కౌల్టర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా (9) , కుల్దీప్ యాదవ్ (5) ఉన్నారు. ఇప్పటివరకు బెహెండ్రోఫ్ నాలుగు వికెట్లు తీయగా, జంపా 2, కౌల్టర్ నైల్ ఒక వికెట్ తీశారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 14 ఓవర్లకి 77 గా ఉంది