అలీ: నా అభిమాన అలీ గారికి హ్యాపీ బర్త్ డే: యాంకర్ అనసూయ
- అలీతో అనసూయ ఫొటో
- ఈ బర్త్ డే ఎంతో సంతోషకరంగా ఉండాలి
- ట్వీట్ లో శుభాకాంక్షలు తెలిపిన అనసూయ
బాలనటుడిగా తన కెరీర్ ను ప్రారంభించి.. హాస్యనటుడిగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి.. ఆపై హీరోగా కొన్ని చిత్రాల్లో నటించి తన సత్తా చాటుకున్న కమెడియన్ అలీ. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఓ వెలుగు వెలుగుతున్న అలీ ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అలీకి బర్త్ డే విషెస్ తెలుపుతూ యాంకర్ అనసూయ ఓ ట్వీట్ చేసింది. ‘నా అభిమాన అలీ గారి పుట్టినరోజులన్నింటిలోకి ఈ బర్త్ డే ఎంతో సంతోషకరంగా ఉండాలి.. ప్రేమతో’ అని అనసూయ కోరుకుంది.