చంద్రబాబు: ప్రజలు సంతోషంగా ఉంటే అన్ని ఎన్నికల్లోనూ మనదే విజయం!: సీఎం చంద్రబాబు
- అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
- మరో పార్టీకి అవకాశం ఇవ్వొద్దు
- రాయలసీమలో కరవు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతా: చంద్రబాబు హామీ
ప్రజలు సంతోషంగా ఉంటే అన్ని ఎన్నికల్లో మనం విజయం సాధిస్తామని, మరో పార్టీకి రాష్ట్రంలో అవకాశం ఉండదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో జరిగిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన గృహనిర్మాణంపై చర్చ నిర్వహించారు. అందరికీ ఇళ్లు ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్న చంద్రబాబు, కొంతమందికి ఇళ్లు మంజూరైనప్పటికీ నిర్మించుకునేందుకు ముందుకు రావడం లేదని చెప్పారు.
అందుకే, ఎవరైతే ఇళ్లు కట్టుకోవాలని అనుకుంటారో వారికే మంజూరు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా అనంతపురంలో వరదల గురించి ఆయన ప్రస్తావించారు. అనంతలో వరదలు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని, రాయలసీమలో కరవు లేకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.