: అక్రమ కట్టడాల కూల్చివేత గరం గరం!
హైదరాబాద్ లోని మూసాపేట మైసమ్మ చెరువు స్థలంలో వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చేసిన ప్రయత్నంతో అక్కడ ఘర్షణ నెలకొంది. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న సిబ్బందిపై స్థానికులు దాడి చేశారు. రాళ్ల దాడికి పాల్పడడంతో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి.