కుక్క పిల్ల: రన్‌వేపై కుక్కపిల్ల హల్‌చల్.. విమానాల టేకాఫ్ కి అంతరాయం!
- జపాన్ రాజధాని టోక్యోలో ఘటన
- విమానాలు టేకాఫ్ అయితే ప్రమాదాలు సంభవించే అవకాశం
- ఆరు నిమిషాల పాటు నిలిచిపోయిన 14 విమానాలు
జపాన్ రాజధాని టోక్యోలోని హనెడా ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే పైకి వచ్చిన ఓ కుక్కపిల్ల అటూ ఇటూ తిరుగుతూ విమానాలు ఆగిపోయేలా చేసింది. దాని వల్ల 14 విమానాలు నిలిచిపోయాయని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. సుమారు ఆరు నిమిషాల పాటు నాలుగు రన్‌వేలను మూసివేసినట్లు తెలిపారు. ఆ కుక్క అక్కడ ఉన్న సమయంలో విమానాలు టేకాఫ్ అయితే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సమాచారం తెలిసిన తరువాత ఆ కుక్కపిల్ల యజమాని వచ్చాడని, 40 నిమిషాల పాటు దాని వెంటపడి దాన్ని పట్టుకున్నాడని తెలిపారు.