‘జోష్’ రవి: ఓ హోటల్లో బాయ్ గా పని చేశా..కష్టాలు పడ్డా: హాస్యనటుడు ‘జోష్’ రవి

  • సినిమాల్లోకి వెళతానంటే మా నాన్న ఒప్పుకోలేదు
  • మా అమ్మ చెవి దుద్దులు తాకట్టు పెట్టి..హైదరాబాద్ వచ్చా
  • చందానగర్ లోని ప్లాసిడా హోటల్లో కప్పులు కడిగా
  • నాటి విషయాలను గుర్తుచేసుకున్న ‘జోష్’ రవి

సినిమాల్లో నటించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వచ్చిన తాను ఓ హోటల్లో బాయ్ గా కూడా పని చేశానని ప్రముఖ హాస్యనటుడు ‘జోష్’ రవి అన్నారు. ‘ఐ డ్రీమ్’ ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన ప్రస్తావించాడు. ‘‘క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి.. వాళ్లకు బ్యాక్ గ్రౌండ్ ఉంది, నీకు లేదు’ అని ప్రతి తల్లిదండ్రీ సినీ ఇండస్ట్రీలోకి వెళతామనే తమ పిల్లలకు చెప్పే మాటలు. ఇవే మాటలు నా తల్లిదండ్రులు కూడా నాకు చెప్పారు.

మా నాన్న ఒప్పుకోలేదు. మా అమ్మ చెవి దుద్దులు తాకట్టు పెట్టి నాకు డబ్బులు ఇచ్చింది.  ఆ డబ్బులు తీసుకుని హైదరాబాద్ వచ్చాను. వచ్చిన రెండు రోజులకు ఆ డబ్బులు అయిపోయాయి.. ఓ హోటల్లో పని చేశాను. చందానగర్ ప్లాసిడా హోటల్ లో బాయ్ గా పనిచేశాను. వైట్ షర్ట్ కావాలంటే.. అది కొనుక్కొనేందుకు సికింద్రాబాద్ ‘మెట్రో’ లో బట్టలు చాలా తక్కువకు దొరుకుతాయంటే.. అక్కడికి టిక్కెట్ లేకుండా బస్సులో వెళ్లాను. టిక్కెట్ తీసుకుంటే షర్ట్ కొనుక్కోవడానికి డబ్బులు చాలవు.

హైదరాబాద్ లో బంధువులు ఉన్నారు కానీ, వాళ్లింటికి వెళ్ల లేదు. ఎందుకంటే, వాళ్లింటికి వెళితే ఈ విషయం మా నాన్నకు తెలుస్తుందని.. ఆ హోటల్ లో కప్పులు కడగడం.. ఏ పని అయినా చేసేసే వాడిని.. డబ్బులొస్తాయి కదా అని. అయితే, హోటల్లో పని చేసే బాయ్స్ అందరూ ‘బో (మెడ దగ్గర ధరించేవి)’ లు ధరించారు. నాకు లేదు. దాని గురించి నాకు పెద్దగా తెలియదు. సర్వ్ చేస్తుంటే  ..‘అందరికీ ‘‘బో’లు ఉన్నాయి, ఇతనికి లేదు ఏంటీ?’ అని ఎవరో కస్టమర్ అడిగారు.

ఆ తర్వాత.. నేను లోపలికి వెళ్లాక మమ్మల్ని హోటల్లో పనికి తీసుకువెళ్లిన వ్యక్తి నన్ను ఒకటి కొట్టాడు.. అలా, హోటల్లో పని చేస్తూ పలు కష్టాలు పడ్డాను. రెండు నెలలు పని చేశాను. రోజుకి వెయ్యి రూపాయల చొప్పున వస్తుండేవి. నన్ను ఎవరైతే హోటల్లో కొట్టారో ఆయనే నా టాలెంట్ చూసి దగ్గరకు తీసుకున్నారు. ఎక్కడబడితే అక్కడ యాక్ట్ చేసే వాడిని.. ఎంటర్ టెయిన్ చేసేవాడిని. ఆ తర్వాత..డబ్బుల్లేక మళ్లీ మా ఊరు వెళ్లిపోయాను. ‘మా టీవీ సంతూర్ వన్ ఛాన్స్ టాలెంట్’ కు వెళ్లమని మా మేనమామ నన్ను పంపిస్తే వైజాగ్ వెళ్లి సెలెక్టు అయ్యాను’ అని రవి చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News