యూజీసీ ప్యానెల్: విశ్వ విద్యాలయాల పేర్లలో మతాన్ని తెలిపే పేర్లు వద్దు: యూజీసీ ప్యానెల్
- బనారస్ హిందూ వర్సిటీ, అలీగఢ్ ముస్లిం వర్సిటీల నుంచి ఆ పదాలు తీసేయాలి
- కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే ఆయా వర్సిటీలు లౌకిక విద్యాసంస్థలు
- బనారస్ వర్సిటీ, అలీగఢ్ వర్సిటీ అని పెట్టుకోవచ్చు
దేశవ్యాప్తంగా పది సెంట్రల్ యూనివర్సిటీల్లో జరుగుతున్న అక్రమాలపై దర్యాప్తు చేయడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఓ ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఆ పనిలో ఉన్న సదరు ప్యానెల్ తాజాగా ఓ విషయాన్ని లేవనెత్తింది. యూనివర్సిటీ పేర్లలో ముస్లిం, హిందూ వంటి పదాలు ఉండకూడదని సిఫార్సు చేసింది. బనారస్ హిందూ విశ్వ విద్యాలయం, అలీగఢ్ ముస్లిం వర్సిటీల నుంచి ఆయా పేర్లను తొలగించాలని కోరింది.
కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసే ఆయా వర్సిటీలు లౌకిక విద్యాసంస్థలని గుర్తు చేసింది. ఆ విశ్వ విద్యాలయాలకు అలీగఢ్ వర్సిటీ, బనారస్ యూనివర్సిటీగా పిలవవచ్చని చెప్పింది. లేదంటే ఆ వర్సిటీల వ్యవస్థాపకుల పేర్లు పెట్టొచ్చని పేర్కొంది.