ప్రకాష్ రాజ్: ఇంకా కొత్త అవార్డులు ఎందుకు తీసుకోవడం!: ప్రకాశ్ రాజ్‌కు కేంద్ర మంత్రి సలహా
- ప్రకాశ్ రాజ్ మంచి నటుడు
- వామపక్షాలకు మద్దతు పలుకుతున్నాడు
- మంత్రి సదానందగౌడ వ్యాఖ్యలు
సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉండటాన్ని సినీనటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ పై బీజేపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా, కేంద్ర మంత్రి సదానందగౌడ్ స్పందిస్తూ, మోదీ మౌనానికి నిరసనగా తన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన ప్రకాశ్ రాజ్ ఇంకా కొత్త అవార్డులు తీసుకోవడమేమిటని ప్రశ్నించారు.
ప్రకాశ్ రాజ్ చాలా మంచి నటుడే కానీ, భావజాలపరంగా అతను వామపక్షాలకు మద్దతు పలుకుతున్నాడని విమర్శించారు. తనకు వచ్చిన అవార్డులనే తిరిగి ఇచ్చేస్తానని చెప్పిన ప్రకాశ్ రాజ్, కొత్త అవార్డులు స్వీకరించకూడదనేది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. కాగా, ప్రకాశ్ రాజ్ కు ప్రతిష్టాత్మక ‘శివరామ్ కారంత్’ అవార్డును ఇటీవలే ప్రకటించారు.