‘మా’ ఫిర్యాదు: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఫిర్యాదు.. అశ్లీల వెబ్ సైట్లు నిర్వహిస్తున్న ఓ యువకుడి అరెస్ట్!

  • బెంగళూరులో అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • హైదరాబాద్ కు తరలింపు.. కొనసాగుతున్న విచారణ
  • నాలుగు అశ్లీల వెబ్ సైట్లు నిర్వహిస్తున్న వైనం

సినీ ఆర్టిస్ట్ ల ఫొటోలను మార్ఫింగ్  చేసి అశ్లీల వెబ్ సైట్లు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) చేసిన ఫిర్యాదు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఈ తరహా వెబ్ సైట్లను నిర్వహిస్తున్న దాసరి ప్రదీప్ అనే యువకుడిని బెంగళూరులో అరెస్టు చేశారు. అతనిని బెంగళూరు నుంచి హైదరాబాద్ కు తరలించినట్లు తెలుస్తోంది.

ఈ తరహా వెబ్ సైట్లను అతను మొత్తం నాలుగింటిని నిర్వహిస్తున్నాడని, బెంగళూరులోని అతని కార్యాలయంలోనే అతనిని అరెస్టు చేసినట్లు సమాచారం. ఐటీ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా, అశ్లీల ఫొటోలను పోస్ట్ చేస్తున్న 30 వెబ్ సైట్లను పోలీసులు గుర్తించారు. ఇందులో నాలుగు వెబ్ సైట్లు నిర్వహిస్తున్న దాసరి ప్రదీప్, బెంగళూరు నుంచి ఈ వెబ్ సైట్లను నిర్వహిస్తున్నాడు.

సినీ రంగానికి చెందిన వారివి, ముఖ్యంగా, హీరోయిన్లకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఈ వెబ్ సైట్లలో పోస్ట్ చేస్తున్నట్లు తేలింది. ‘ఏ న్యూడ్ ఇమేజెస్. కామ్’, ‘సుక్ 7. కామ్’, ‘సెక్స్ న్యూడ్ ఇమేజెస్.కామ్’, ‘టాలీవుడ్ ఇమేజెస్. కామ్’ ఈ నాలుగు వెబ్ సైట్లను దాసరి ప్రదీప్ నిర్వహిస్తున్నట్టు తేలింది.

  • Loading...

More Telugu News