నాగ చైతన్య: హ్యాపీ మూడ్.. చైతూ చొక్కా లాగేసిస నాగ్!
- నాగచైతన్య-సమంత పెళ్లి వేడుకల్లో అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల హంగామా
- కొడుకు చొక్కా లాగేస్తున్న నాగ్ ఫొటో వైరల్
- తండ్రీ కొడుకుల చెప్పలేని సంతోషం
నిన్న గోవాలో నాగచైతన్య-సమంత వివాహం క్రైస్తవ పద్ధతిలో చాలా గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. సమంత చేతికి ఉంగరం తొడిగిన అనంతరం, పెళ్లి ప్రమాణం చేసిన ఈ జంట ఒక్కటైంది. హిందూ, క్రైస్తవ సంపద్రాయ పద్ధతుల్లో వీరి వివాహం రెండు రోజుల పాటు కనుల పండువగా జరిగింది. ఈ పెళ్లి వేడుక సందర్భంగా జరుపుకున్న అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు చెందిన వారు ఆటపాటలతో ఎంతో ఎంజాయ్ చేశారు. నాగార్జున అయితే నాగ చైతన్య చొక్కా లాగేసి మరి, హంగామా చేశాడట. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఈ ఫొటోలో చెప్పలేని సంతోషంతో నాగ చైతన్య, నాగ్ ఉన్నారు.