jagan: ‘టీడీపీలోకి వైసీపీ నేతల జంప్’ వార్త‌ల‌పై జ‌గ‌న్ అప్రమత్తం.. క‌ర్నూలు నేత‌లతో భేటీ!

  • ప‌లువురు నేత‌లతో మాట్లాడుతున్న జగన్
  • ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లాలోని ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేల‌తో భేటీ
  • కార్యకర్తలు టీడీపీలో చేరమంటున్నారని జగన్ కు చెప్పిన నేతలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు టీడీపీలోకి జంప్ అవుతున్నార‌ని వ‌స్తోన్న వార్త‌ల‌పై వైసీపీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అప్రమత్తమై, త‌గిన‌ చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. త‌మ పార్టీని వీడుతున్నార‌ని జ‌రుగుతోన్న ప్రచారంపై ఆయా నేత‌లతో ఆయన మాట్లాడుతున్నారు. ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లాలోని ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేల‌తో జ‌గ‌న్ స‌మావేశం అయ్యారు. అయితే, ఈ భేటీలో జ‌గ‌న్‌కు షాక్ త‌గిలిన‌ట్లు స‌మాచారం.

టీడీపీలో చేరాల‌ని కార్య‌క‌ర్త‌లు త‌మ‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని స‌ద‌రు ఎంపీ, ఎమ్మెల్యేలు కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పిన‌ట్లు తెలిసింది. కార్య‌క‌ర్త‌ల అభీష్టం మేర‌కే న‌డుచుకుంటామ‌ని వారు అన్న‌ట్లు స‌మాచారం. కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, అనంతపురం మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు త్వరలోనే సైకిల్ ఎక్కబోతున్నట్టు నిన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News