మ్యారేజ్ శామ్: వెంకటేశ్, నాగార్జునతో కలిసి డ్యాన్స్ చేసిన పెళ్లికొడుకు నాగచైతన్య!
- నిన్న రాత్రి హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి
- చైతూ డ్యాన్స్ చేసిన ఫొటోలను పోస్ట్ చేసిన నాగ్
- హ్యాపీనెస్ విత్ వెంకీ, చై అని పేర్కొన్న నాగార్జున
హిందూ సంప్రదాయం ప్రకారం సినీనటులు నాగచైతన్య, సమంత వివాహం నిన్న రాత్రి గోవాలో జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సమంత చేసిన సందడి గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసి పోయింది. సమంతనే కాకుండా పెళ్లి కొడుకు నాగచైతన్య కూడా బాగానే అల్లరి చేశాడు. కానీ, అవి అంతగా సోషల్ మీడియాలోకి ఎక్కలేదు.
ఈ నేపథ్యంలో, వెంకటేశ్, నాగార్జునతో కలిసి నాగచైతన్య స్టెప్పులు వేస్తుండగా తీసిన ఫొటోలను నాగార్జున తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. నిన్న రాత్రి నాగచైతన్య హుషారుగా తమతో కలిసి ఇలా డ్యాన్సు చేశాడని నాగ్ తెలిపారు. హ్యాపీనెస్ విత్ వెంకీ, చై అంటూ పేర్కొన్నారు.