‘సాహో’ విలన్: ప్రభాస్ నిజంగా డార్లింగే .. శ్రద్ధాకపూర్ అమేజింగ్!: ‘సాహో’ విలన్
- హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధాకపూర్ లపై ప్రశంసల వర్షం
- ఇద్దర్నీ కలసి సెట్లో చూడాలనుకుంటున్న నితిన్ ముఖేష్
- సాహో షూటింగ్ పూర్తి చేసిన ముఖేశ్
సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సాహో’. ఈ చిత్రంలో విలన్ గా నితిన్ ముఖేశ్ నటిస్తున్నాడు. ‘సాహో’లో తన పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను ఇటీవలే పూర్తి చేసిన నితిన్ ముఖేశ్ తాజాగా ఓ ట్వీట్ చేశాడు. హీరో ప్రభాస్, హీరోయిన్ శ్రద్ధాకపూర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
‘ప్రభాస్ నిజంగా డార్లింగే .. శ్రద్ధాకపూర్ అమేజింగ్. త్వరలోనే సెట్స్ లో మీ ఇద్దర్నీ కలసి చూడాలని అనుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ’ అని ఓ ట్వీట్ లో పేర్కొన్నాడు. కాగా, భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని 2018లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు. అదే రోజున ‘సాహో’ టీజర్ విడుదల చేయనున్నట్టు సమాచారం.