ఆర్‌.నారాయణమూర్తి: ‘కొమరం భీమ్ జాతీయ పురస్కారం’ అందుకోనున్న సినీనటుడు ఆర్‌.నారాయణమూర్తి

  • ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు రమణాచారి
  • విప్ల‌వ చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా రాణిస్తోన్న నారాయ‌ణ మూర్తి
  • ప్ర‌తి ఏడాది ఒకరికి ఈ అవార్డు 

సినీ నటుడు ఆర్.నారాయణ మూర్తికి ‘కొమరం భీమ్ జాతీయ పురస్కారం’ అందించ‌నున్న‌ట్లు ఆ అవార్డు కమిటీ చైర్మన్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఈ రోజు ప్ర‌క‌టించారు. ఈ అవార్డును ప్ర‌తి ఏడాది తెలంగాణ టెలివిజన్ డెవలప్‌మెంట్ ఫోరమ్, ఆదివాసి సాంస్కృతిక పరిషత్, గోండ్వానా సాంస్కృతిక పరిరక్షణ దళం, భారత్ కల్చరల్ అకాడమీ సంయుక్తంగా అందిస్తున్నాయి. విప్ల‌వ చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా ద‌ర్శ‌కుడిగా, నిర్మాత‌గా రాణిస్తోన్న ఆర్‌.నారాయ‌ణ మూర్తి ఈ అవార్డుకు అర్హుడ‌ని అవార్డు క‌మిటీ పేర్కొంది. 

  • Loading...

More Telugu News