పాకిస్థాన్: పాక్ ఐఎస్ఐ కనుసన్నల్లో కొత్త ఉగ్రవాద సంస్థ?

  • ఓ ఆంగ్లపత్రిక కథనం
  • ‘హలాల్ దస్తా’ అనే కొత్త ఉగ్రవాద సంస్థ
  • ఎల్ఓసీ వద్ద దాడులు చేయడం, భారత సైన్యానికి నష్టం కల్గించడమే దీని లక్ష్యం 

‘హలాల్ దస్తా’ అనే కొత్త ఉగ్రవాద సంస్థను పాకిస్థాన్ కు చెందిన ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సంస్థ ప్రారంభించినట్టు ఓ ఆంగ్లపత్రిక కథనం. ‘హలాల్ దస్తా’ అంటే ‘కిల్లర్ స్క్వాడ్’ అని అర్థం. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులతో ‘హలాల్ దస్తా’ను ఏర్పాటు చేసినట్టు భారత ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంగా ఆ కథనంలో పేర్కొంది.

పాకిస్తాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్) తో పాటు హలాల్ దస్తా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద దాడులకు పాల్పడటం, జమ్మూకాశ్మీర్ లోని సురాన్ కోట్, పూంఛ్ జిల్లాల్లో తీవ్ర నష్టం కలిగించడం, భారత సైనికులను హతమార్చడం వంటి లక్ష్యాలతో ఈ కొత్త ఉగ్రవాద సంస్థ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. దాడులకు సంబంధించిన బ్లూ ప్రింట్ నిమిత్తం లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన అగ్రస్థాయి కమాండర్లతో ఐఎస్ఐ అధికారులు ఇప్పటికే సమావేశం నిర్వహించినట్టు ఆ కథనంలో పేర్కొంది.

  • Loading...

More Telugu News