కాళేశ్వరం ప్రాజెక్టు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై స్టే విధించిన ఎన్జీటీ!
- అనుమతులు లేకుండా నిర్మాణ పనులు చేపట్టారంటూ పిటిషన్
- తాగునీటి కోసమే ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్న తెలంగాణ ప్రభుత్వం
- టీ సర్కార్ వాదనలను పట్టించుకోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్టీటీ) స్టే విధించింది. అనుమతులు వచ్చే వరకు పనులు చేయొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు రాకుండానే పనులు ప్రారంభించారంటూ దాఖలైన పిటిషన్ పై ఎన్జీటీ స్పందించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. తాగునీటి కోసమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్న ప్రభుత్వ వాదనను ఎన్జీటీ పట్టించుకోలేదు. అనుమతించే వరకూ ప్రాజెక్టు పనులు చేపట్టవద్దంటూ ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది.