పాడేరు : విశాఖ జిల్లాలో... ఎక్సైజ్ అధికారులను అడ్డుకొని జీపుల అద్దాలను ధ్వంసం చేసిన మహిళలు
- విశాఖపట్నంలోని పాడేరు మండలంలో ఘటన
- ఎగువ సొలములు, సరియాపల్లిలో గంజాయి తోటలు
- 36 ఎకరాల్లో గంజాయి తోట ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖ సిబ్బంది
విశాఖపట్నంలోని పాడేరు మండలం ఎగువ సొలములు, సరియాపల్లిలో అలజడి చెలరేగుతోంది. ఆ ప్రాంతాల్లో అతి భారీగా గంజాయిని పండిస్తున్నారని తెలుసుకున్న ఎక్సైజ్ అధికారులు పోలీసు భద్రతతో అక్కడికి వెళ్లారు. అయితే, ఈ క్రమంలో అక్కడి మహిళలంతా కలిసి అధికారులను అడ్డుకుని, జీపులను ధ్వంసం చేశారు. అయినప్పటికీ పోలీసుల సాయంతో 36 ఎకరాల్లో గంజాయి తోటను ఎక్సైజ్ శాఖ సిబ్బంది ధ్వంసం చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే శిక్ష తప్పదని ఎక్సైజ్ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.