ప్రభాస్: ‘బాహుబలి’ని కలిసిన సైనా నెహ్వాల్

  • ‘సాహో’ సెట్స్ లో ప్రభాస్ ను కలిసిన సైనా
  •  ప్రభాస్ తో కలిసి ఫొటో దిగిన షట్లర్
  • ట్విట్టర్ లో ఫొటో పోస్ట్ చేసిన సైనా 

ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ తన అభిమాన హీరో ప్రభాస్ ను కలిసింది. ‘బాహుబలి - 2’ సినిమా తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా ‘సాహో’. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ సెట్స్ లో ప్రభాస్ ను సైనా కలిసింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా సైనా తెలిపింది.

‘బాహుబలి (ప్రభాస్)తో ..’ అని ఆ ట్వీట్ లో పేర్కొన్న సైనా, ప్రభాస్ తో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేసింది. కాగా, ప్రభాస్ ను కలిసేందుకు సైనా తన తల్లిదండ్రులతో పాటు వెళ్లింది. ప్రభాస్ తో సైనా కుటుంబసభ్యులు కలిసి దిగిన మరో ఫొటో కూడా సామాజిక మాధ్యమాలకు చేరింది.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News