సమంత: ట్విట్టర్ లో నాతో ఛాటింగ్ చేయండి: పెళ్లి కూతురు సమంత
- అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు
- అందరికీ థ్యాంక్స్ చెప్పిన సమంత
- ‘ఐ లవ్ యూ.. ఆస్క్ సామ్-3పీఎం’ అంటూ ట్వీట్
ట్విట్టర్‌లో హీరోయిన్ సమంత ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంత బిజీగా ఉన్నా అప్పుడప్పుడు అభిమానులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ ఉంటుంది. రేపు పెళ్లి పెట్టుకుని ఈ రోజు ఆమె తన ట్విట్టర్ ఫాలోయర్లతో ముచ్చట పెట్టింది. తన అవసరం వచ్చినపుడు తన పక్కన నిలబడిన అందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. ‘ఐ లవ్ యూ.. ఆస్క్ సామ్-3పీఎం’ అంటూ ట్వీట్ చేసింది.
పెళ్లి కూతురు సమంత తనతో చాటింగ్ చేయమని అడగడమే ఆలస్యం.. ఆమెపై అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. వారి ప్రశ్నలకు సమంత ఓపికగా సమాధానాలు చెబుతోంది.