ఆత్మహత్య: పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఆత్మహత్య

  • చదువుకోవడం ఇష్టంలేక పురుగుల మందు తాగిన 12 ఏళ్ల వేణు
  • ఇటీవ‌ల ద‌స‌రా సెల‌వుల్లో ఇంటికి వెళ్లొచ్చిన బాలుడు
  • సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో ఘటన

చదువుకోవడం ఇష్టంలేక 12 ఏళ్ల బాలుడు ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మైనార్టీ గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. ఇటీవ‌ల ద‌స‌రా సెల‌వుల్లో మేళ్లచెరువు మండలం వేపల మాదవరం గ్రామంలోని త‌న ఇంటికి వెళ్లి ఇంట్లో వండిన పిండి వంట‌లు తిని, చ‌క్క‌గా ఆడీపాడీ ఎంజాయ్ చేసిన ఏడో తరగతి బాలుడు వేణు నిన్న తిరిగి హాస్టల్‌కి వచ్చాడు.

చ‌దువు ఇష్టంలేక ఎంతో ఒత్తిడికి గురైన ఆ బాలుడు ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగాడు. పాఠశాల సిబ్బంది అత‌డిని సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆ బాలుడు మృతి చెందాడని వైద్యులు నిర్థారించారు. 

  • Loading...

More Telugu News