: కడప జిల్లాలో నల్లధన ప్రవాహం
వైఎస్సార్ కడప జిల్లాలో అక్రమ ధనం ఏరులై పారుతోంది. ఈ రోజు తనిఖీలు చేస్తున్న రైల్వే కోడూరు పోలీసులకు 30లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. తనిఖీల సందర్భంగా ఓ వాహనంలో డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎటువంటి బిల్లులు, పత్రాలు లేకపోవడంతో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సరిగ్గా మూడు రోజుల క్రితం ఈ నెల 3న కడప జిల్లా ప్రొద్దుటూరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా 21 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి.