రఘువీరారెడ్డి: చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి: రఘువీరారెడ్డి
- పోలవరం కాదు.. కమీషన్ల వరం
- 2018 నాటికి పోలవరం పూర్తి చేయాలి
- దోచుకోవడానికే ఆ ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం వాడుకుంటోంది
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే పని తక్కువ, మాటలు ఎక్కువ అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఈ రోజు రఘువీరారెడ్డి మాట్లాడుతూ... చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేయాలని అన్నారు. లేకపోతే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పోటీ చేయకూడదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయి కానీ, పనులు మాత్రం జరగడం లేదని అన్నారు.
దోచుకోవడానికే పోలవరం ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం వాడుకుంటోందని, అది పోలవరం కాదని, కమీషన్ల వరం అని రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. 1995 నుంచి 2004 వరకు 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడు పోలవరం ఊసే ఎత్తలేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2004 జులైలో పోలవరానికి నిధులు మంజూరు చేసిందని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఖర్చు చేశామని తెలిపారు.