ఎంపీ జేసీ: మనం పోయిన తర్వాత కూడా నాలుగైదు సంవత్సరాలు మన పేరు తలచుకోవాలి!: ఎంపీ జేసీ
- నాకు ఒకటే ఆశ ఉంది
- ఫలానా పని చేసి పోయాడనే మంచిపేరు వుండాలి
- తాజా ఇంటర్వ్యూలో జేసీ దివాకర్ రెడ్డి
మా ప్రజలు బాగుండాలి, మేము బాగుండాలని తాను కోరుకుంటానని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నేను రాజకీయాల్లో ఉండి ఒక మంచి కార్యక్రమం చేయకపోతే ఎట్లా! నాకు ఒకటే ఆశ ఉంది.. మనం చచ్చిపోయిన తర్వాత, మనం పైకి పోయిన తర్వాత కూడా నాలుగైదు సంవత్సరాలు మన పేరు తలచుకునేటట్టు ఉండాలి. దివాకర్ రెడ్డి అనేవాడు ఉండేవాడు, ఫలానా పని చేసి పోయాడనే మంచిపేరు రావాలనేదే నా ఆశ’ అని చెప్పుకొచ్చారు.