విజయ్ మాల్యా: ఇలా అరెస్ట్ .. అలా బెయిల్.. ఇంటికొచ్చేసిన విజయ్ మాల్యా!

  • అరెస్టు అయిన కొద్దిసేప‌టికే ఇంటికి చేరుకున్న మాల్యా
  • ఆరు నెలల వ్యవధిలో విజయ్ మాల్యా రెండు సార్లు అరెస్టు
  • డిసెంబర్ లో తుది విచారణ 

వ్యాపార‌వేత్త‌ విజయ్ మాల్యాను లండ‌న్‌ పోలీసులు అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ వెంటనే ఆయ‌న‌కు బెయిల్ ల‌భించింది. అరెస్టు చేసిన కొద్దిసేప‌టికే ఆయ‌న మ‌ళ్లీ త‌న ఇంటికి చేరుకున్నారు. భార‌తీయ బ్యాంకుల్లో కోట్లాది రూపాయ‌లు రుణం తీసుకుని తిరిగి తీర్చ‌కుండా లండ‌న్‌కు చెక్కేసిన విజ‌య్ మాల్యాను తిరిగి భార‌త్‌కు ర‌ప్పించ‌డానికి అధికారులు ప్ర‌య‌త్నిస్తోన్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో లండ‌న్‌లోని కోర్టులో విజ‌య్ మాల్యా వ్య‌వ‌హారంపై విచార‌ణ కొన‌సాగుతోంది. ఈ ఏడాది డిసెంబరులో తుది విచారణ జరగనుంది. ఈ క్రమంలో విజయ్ మాల్యా మనీలాండరింగ్ కు సంబంధించిన ఆధారాలను సంబంధిత భారత అధికారులు సమర్పిస్తున్నారు. ఆరు నెలల వ్యవధిలో పోలీసులు విజయ్ మాల్యాను రెండు సార్లు అరెస్టు చేశారు. 

  • Loading...

More Telugu News